![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -837 లో... కావ్యకి నిజం తెలిసినట్లు, తను కళ్ళు తిరిగిపడిపోయినట్లు రాజ్ ఉహించుకుంటాడు. ఆ తర్వాత ఈ విషయం కావ్యకి తెలియొద్దనుకుంటాడు. అసలు ఎందుకు రాజ్ ఇలా బిహేవ్ చేస్తున్నాడోనని ఇంట్లో అందరు ఆలోచిస్తారు. రాజ్ కి అర్థమయ్యేలా చెప్తాను.. తన నిర్ణయం మార్చుకోవాలని రాజ్ ని రిక్వెస్ట్ చేస్తానని రాహుల్ ఇంట్లో వాళ్ళతో అంటాడు. థాంక్స్ రాహుల్ నువ్వైనా నా చెల్లి బాధని అర్థం చేసుకున్నావని స్వప్న అంటుంది.
ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో చెప్పండి అని రాజ్ ని కావ్య అడుగుతుంది. నువ్వు మొన్న నేను చెప్పినట్టు వింటానని మాటిచ్చావని రాజ్ అంటాడు. మరుసటి రోజు అందరు హాల్లో కూర్చొని ఉంటారు. రాజ్ నువ్వు చేస్తుంది తప్పు.. ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకోమని రాజ్ తో రాహుల్ అంటాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు కావ్య అని రాజ్ అంటాడు. నేను ఇందుకు ఒప్పుకోనని కావ్య అంటుంది. అయితే నీకు నేను కావాలో, నీ బిడ్డ కావాలో తేల్చుకోమని రాజ్ అనగానే.. నాకు నా బిడ్డనే కావాలని కావ్య అంటుంది.
తరువాయి భాగం లో కావ్య తాగే జ్యూస్ లో అబార్షన్ టాబ్లెట్ కలుపుతాడు రాజ్. కావ్య అది తాగుతుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. అసలు కళ్యాణ్ ఎంట్రీ ఎపిసోడ్ క్లైమాక్స్ చూపించారంటే కళ్యాణ్ ఏదో చెప్పడానికి వచ్చాడు కాబోలు రిపోర్ట్స్ వదినవి కావు అని చెప్తే రాజ్ పరిస్థితి ఏంటి.. ఇక కావ్య దృష్టిలో రాజ్ విలన్ అన్నమాట. మరి ఈ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే సోమవారం నాటి ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |